← Back to news

జంతర్ మంతర్ వద్ద భారీ పోలీసు బందోబస్తు

By DK· 20 Jul 2026· ఢిల్లీ
జంతర్ మంతర్ వద్ద భారీ పోలీసు బందోబస్తు

ఇవాళ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు CJP ఛలో పార్లమెంట్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. జంతర్ మంతర్ దగ్గర దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్‌ను తరలించే ముందు కూడా ఇలాగే భారీ ఎత్తున పోలీసులు దీక్షా స్థలిని చుట్టుముట్టారు. CJP ఫౌండర్ అభిజిత్ దీప్కేను, వివిధ విద్యార్థి సంఘాల నేతలను కూడా అక్కడి నుంచి తరలించనున్నట్లు సమాచారం. ఛలో పార్లమెంట్ కార్యక్రమానికి పెద్దఎత్తున సీజేపీ మద్దతుదారులు వస్తుండడంతో హైటెన్షన్ నెలకుంది.

More in Education