← Back to news

పథకాలు ఆపొద్దని BRS నాయకుల నిరసన

By GANDHAM PRAVEEN KUMAR· 17 Aug 2026· Khanapur, Adilabad Rural, Adilabad
పథకాలు ఆపొద్దని BRS నాయకుల నిరసన

TG: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో BRS నాయకులు ర్యాలీ నిర్వహించారు. మాజీ MPTC గజేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గజేంద్ర మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు వంటి పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

పథకాలు ఆపొద్దని BRS నాయకుల నిరసన

More in Local