చాందినీ చౌక్‌లో ఢిల్లీ ఓల్డెస్ట్ లైబ్రరీ గురించి తెలుసా?

ఢిల్లీలోని చాంద్నీ చౌక్ అంటే ఎప్పుడూ సందడిగా, రద్దీగా ఉండే ఏరియా. అక్కడే ఒక పాత బిల్లింగ్‌లో ఉండే ‘Hardayal Municipal Heritage Public Library’ గురించి చాలామందికి తెలియదు. 1862లో స్టార్ట్ అయిన ఈ లైబ్రరీ ఢిల్లీ ఓల్డెస్ట్ పబ్లిక్ లైబ్రరీ. 1916లో ఇప్పుడున్న బిల్డింగ్‌లోకి షిఫ్ట్ అయింది. ఇక్కడ సుమారు 1.7 లక్షలకుపైగా హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, అరబిక్, పర్షియన్, సంస్కృతం భాషల బుక్స్ ఉన్నాయ. 1600 నాటి చేతిరాత పుస్తకాలు సైతం ఇక్కడున్నాయి. పర్షియన్ భాషలోకి అనువాదమైన మహాభారతాన్ని ఇక్కడ మనం చూడొచ్చు.



