← Back to news

స్టూడెంట్స్‌కు నీళ్ల చారు, ఉడకని అన్నం

By dk· 12 Aug 2026· కర్నూలు జిల్లా
స్టూడెంట్స్‌కు నీళ్ల చారు, ఉడకని అన్నం

AP: కర్నూలు జిల్లా హొళగుంద ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై SFI నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నీళ్ల చారు, సరిగ్గా ఉడకని అన్నం అందిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రస్తుత వంట ఏజెన్సీని వెంటనే రద్దు చేసి, నాణ్యమైన, పౌష్టికాహారం అందించే ఏజెన్సీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

More in AP