సూర్యలంకకు వెళ్తుండగా ఊహించని విషాదం

AP: గుంటూరు బైపాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ DCP సిరీనా బేగం కుమార్తె హఫీఫా మృతి చెందారు. హఫీఫా మరో ముగ్గురు స్నేహితులతో కలిసి బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌కు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైపాస్ సమీపంలో రేషన్ సరఫరా లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హఫీఫాను వెంటనే సమీపంలోని ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



