← Back to news

8 లక్షల మంది యువతతో PM Modi

By Nani Garikina· 26 Aug 2026· Indiatimes
8 లక్షల మంది యువతతో PM Modi

రేపు దేశవ్యాప్తంగా లక్షలాది యువత ఒకే వేదికపైకి రానున్నారు. ఆగస్టు 27న జరిగే ‘ఖేలో ఇండియా సంవాద్’లో ప్రధాని మోదీ సుమారు 8 లక్షల మంది యువతతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు. యువతను క్రీడలతో పాటు దేశ అభివృద్ధిలో మరింత భాగస్వామ్యం చేయడంపై ఈ కార్యక్రమం ఫోకస్ పెట్టనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత పాల్గొనడంతో వారి ఆలోచనలు, ఆసక్తులు, ఆశయాలకు ఈ వేదిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇంతమంది యువతతో ఒకేసారి మాట్లాడనున్న ప్రధాని ఏ అంశాలపై ఫోకస్ చేస్తారు? ఎలాంటి సందేశం ఇస్తారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.

More in Gen Z