← Back to news

యూకేలో ‘బ్రేకప్’ బజ్‌.. ఇంగ్లాండ్‌కు తోడెవరు?

By Anusha· 6h ago
యూకేలో ‘బ్రేకప్’ బజ్‌.. ఇంగ్లాండ్‌కు తోడెవరు?

ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన బ్రిటన్‌ ఇప్పుడు సొంత గడ్డ మీదే విభజన డిమాండ్లను ఎదుర్కొంటోంది. యూకే నుంచి విడిపోయి మరింత స్వయంప్రతిపత్తి సాధించాలంటూ స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్‌ ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. తమ భాష, సంస్కృతి, వనరులపై నిర్ణయాలు తామే తీసుకోవాలని ఈ ప్రాంతాలు కోరుతున్నాయి. స్కాట్లాండ్‌ ఈయూలో తిరిగి చేరాలని భావిస్తుండగా, నార్తర్న్ ఐర్లాండ్‌లో కొందరు రిపబ్లిక్‌ ఆఫ్ ఐర్లాండ్‌తో కలవాలని కోరుతున్నారు. ఈ పరిణామాలతో యూకే భవిష్యత్తుపై చర్చ మొదలైంది.

More in International

ఇండియన్ స్టూడెంట్స్‌పై కామెంట్స్.. బో ఫ్రెంచ్‌పై విమర్శలు!
International· 8h ago

ఇండియన్ స్టూడెంట్స్‌పై కామెంట్స్.. బో ఫ్రెంచ్‌పై విమర్శలు!

అమెరికా రిపబ్లికన్ నేత బో ఫ్రెంచ్.. టెక్సాస్ యూనివర్సిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఇండియన్, దక్షిణాసియా స్టూడెంట్స్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. వారిని ‘ఫారినర్స్’గా పేర్కొంటూ అమెరికన్ల అవకాశాలను విదేశీయులు ఆక్రమిస్తున్నారంటూ <a href="https://x.com/bofrench/status/2099142867025383497?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2099142867025383497%7Ctwgr%5Ec8711a43d9b2e368f69e96dcb84abc21f32eb28b%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.firstpost.com%2Fworld%2Fbo-french-splits-us-mid-term-elections-with-his-racist-remarks-targeting-indian-students-14046020.html">'X'లో</a> పోస్టు చేశారు. దీంతో ఆయనపై రేసిజం, జెనోఫోబియా ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ నేతలు, సెనేటర్ జాన్ కార్నిన్ కూడా ఫ్రెంచ్ కామెంట్స్‌ను తప్పుబట్టారు. ఆయన మాత్రం తన కామెంట్స్‌పై వెనక్కి తగ్గకుండా సమర్థించుకున్నారు.