కునోలో కొత్త ప్రాజెక్ట్.. పెరుగుతున్న ఆందోళన

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ వల్ల 8 గ్రామాలు, 1,200 కుటుంబాలపై ప్రభావం పడనుంది. చీతాలు ఉండే అడవిలో కొంత భాగం కూడా నీటిలో మునిగిపోయే అవకాశం ఉంది. చీతాలతోపాటు మనుషులు కూడా వారి నివాసాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రీలొకేట్ చేసిన కొన్ని కుటుంబాలు, ఇప్పుడు మళ్లీ ఆ ప్రాంతాలను వదిలి వెళ్ళాలా అని ఆందోళన పడుతున్నారు.



