← Back to news

సద్దుల బతుకమ్మ వేడుకల్లో CPI నాయకులు

By SK RAFI· 23h ago· Bhadradri Kothagudem
సద్దుల బతుకమ్మ వేడుకల్లో CPI నాయకులు

భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, నగరపాలక సంస్థ మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. పలుచోట్ల సామూహికంగా బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు.

More in Local