నకిలీ DAP గుట్టు రట్టు

TG: సూర్యాపేట జిల్లా మఠంపల్లి, మేళచెరువు మండలాల్లో రైతులకి కొందరు నకిలీ ఎరువులు DAP అమ్మారు. అనుమానం వచ్చిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం బయటపడింది. రాత్రి వేళల్లో DCM ద్వారా సరఫరా చేస్తున్న డ్రైవర్‌ను విచారణ చెయ్యగా రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట్‌లో తయారీ కేంద్రాన్ని చూపించడంతో ఇక్కడకి చేరుకున్న అధికారులకి నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి. సొంతంగా గ్రోమోర్ పేరుతో బ్యాగ్‌లు ప్రింట్ చేసి ఉప్పు, పౌడర్, కలర్‌తో తయారు చేసిన మందుని బ్యాగుల్లో నింపి సరఫరా చేస్తున్నారు. సుమారు 1000 బ్యాగులను అధికారులు సీజ్ చేశారు.



