తిరుమలలో ఏఐ

తిరుమలలో ప్రత్యేక రోజులు, లాంగ్ వీకెండ్‌లలో భక్తుల రద్దీని కంట్రోల్ చెయ్యడానికి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ప్రొఫెసర్ టి.శోభారాణి.. AI ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇది CCTV, IOT, AI అల్గారిథమ్‌లతో రియల్‌టైంలో భక్తుల కదలికలను గమనిస్తూ, అసాధారణ రద్దీని గుర్తించి అధికారులను అప్రమత్తం చేస్తుంది. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. దీనికి పీఎం-ఉష నిధులతో 5లక్షల 61 వేలు వచ్చాయి. పేటెంట్ పొంది, టీటీడీ సహకారంతో ఇది త్వరలో అమలు కాబోతోంది.


