యాలాల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఆయుధ పూజలు..

వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయుధ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పోలీస్ సిబ్బంది తమ ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేసి వేడుకల్లో పాల్గొన్నారు. విజయదశమి పండుగను ప్రజలంతా సుఖసంతోషాలతో, ప్రశాంత వాతావరణంలో, ఐకమత్యంతో జరుపుకోవాలని పోలీస్ అధికారులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాలాల పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.


