మణిపూర్‌లో మళ్లీ హింస!

కొన్నాళ్లుగా వార్తల్లో లేని మణిపూర్ ప్రశాంతంగా అయితే లేదు. జాతుల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. కాంగ్‌పోక్పి జిల్లాలోని 'టోక్‌పా లియాంగ్‌మై నాగా' గ్రామంలోకి మంగళవారం రాత్రి కొందరు కాల్పులు జరుపుతూ, ఇళ్లకు నిప్పు పెట్టారు. దాదాపు 9 గుడిసెలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. 2023 మే నెలలో మణిపూర్లో కుకీ, మెయిటీ జాతుల మధ్య ఘర్షణ తలెత్తి వందల మంది చనిపోయారు. వేలాది మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2025 ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.



