వెండితెరపై 'మిర్జాపూర్'

భారతీయ ఓటీటీ చరిత్రలో సంచలనం సృష్టించిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది. రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్న ఈ భారీ మూవీ అధికారిక ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. గుర్‌మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, సిరీస్‌లో అదరగొట్టిన ప్రధాన నటీనటులందరూ మళ్లీ పెద్ద తెరపై కనిపించనున్నారు . ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రానుంది.



