← Back to news

స్పెషల్ బస్సుల పేరుతో బాదుడేనా.. హరీశ్ రావు

By Prashanth· 1d ago
స్పెషల్ బస్సుల పేరుతో బాదుడేనా.. హరీశ్ రావు

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా స్పెషల్ బస్సుల పేరుతో RTC అధిక ఛార్జీలు వసూలు చేస్తోందని BRS ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. JBS నుంచి కరీంనగర్‌కు టికెట్ ధరను 230 నుంచి 400కు, మహబూబ్‌నగర్ నుంచి MGBSకు 220 నుంచి 290కు పైగా పెంచారని అన్నారు. రెగ్యులర్ బస్సులను తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికులపై అదనపు భారం మోపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పెంచిన ఛార్జీలను తగ్గించి, సాధారణ బస్సులను యథావిధిగా నడపాలని ఆయన డిమాండ్ చేశారు.

More in TG