← Back to news

నేరస్థులను తయారు చేసే కర్మాగారం YCP: మంత్రి నిమ్మల

By డీకే· 24 Jun 2026· Eenadu· అమరావతి
నేరస్థులను తయారు చేసే కర్మాగారం YCP: మంత్రి నిమ్మల

AP: నేరస్థులను తయారు చేసే కర్మాగారం YCP అని, నేతలను తయారు చేసే పార్టీ TDP అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు ద్రోహం చేసింది, చేస్తుంది YS జగన్మోహన్ రెడ్డేనని, కేంద్రం EWS కింద 10% రిజర్వేషన్లు ఇస్తే గత TDP ప్రభుత్వంలో చంద్రబాబు ఎవరికీ ఇబ్బంది లేనివిధంగా అందులో 5% కాపులకు కేటాయించారు. జగన్ CM అయ్యాక వాటిని రద్దు చేశారు. YCPలో కాపు నాయకులు అప్పుడు ఎందుకు ఆయన్ను నిలదీయలేదన్నారు. ఏ చెంపదెబ్బలు తినాల్సి వస్తుందోనని భయపడ్డారు అని మంత్రి నిమ్మల ప్రశ్నించారు.

More in Politics