‘జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ ఫుల్’: హరీశ్ రావు

TG: తెలంగాణ ప్రభుత్వం 121 రకాల కొత్త మద్యం బ్రాండ్లకు నోటిఫికేషన్ ఇవ్వడంపై BRS లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా మద్యం బ్రాండ్లకు మాత్రం నోటిఫికేషన్లు ఇస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ‘జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్’ అంటూ <a href="https://x.com/BRSHarish/status/2091778937584308575?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2091778937584308575%7Ctwgr%5E2d1e51a519e130b84159f420033028be9c28718b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Ftelangana%2Fhyderabad%2Ftelangana-job-notifications-nil-liquor-notifications-full-harish-rao-slams-congress-government-sj-1552344.html">'ఎక్స్'లో</a> ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే.. ప్రభుత్వం లిక్కర్ అమ్మకాలపై ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందని అన్నారు.




