విమెన్స్ పాలిటెక్నిక్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్
వనపర్తి జిల్లా పెబ్బేరు గవర్నమెంట్ విమెన్స్ పాలిటెక్నిక్ హాస్టల్‌లో బుధవారం డిన్నర్లో రాత్రి చికెన్ తిని 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నవారిని ప్రైమరీ హెల్త్ సెంటర్ కి తరలించారు. అయితే ఘటన బయటకు రాకుండా మ్యానేజిమెంట్ ప్రయత్నించిందని, కేవలం వైరల్ ఫీవర్ అని చెప్పి కప్పిపుచ్చుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.



