← Back to news

70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

By Srinivas· 1h ago· Nagarkurnool
70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

TG: నాగర్ కర్నూల్ జిల్లాలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యారంగానికి విశిష్ట సేవలు అందిస్తున్న 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా స్థాయిలో ఘనంగా సన్మానించనున్నట్లు డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. బోధనా ప్రతిభ, విద్యార్థుల విద్యాభివృద్ధికి చేసిన కృషి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 5న మధ్యాహ్నం 3 గంటలకు ఐడీఓసీ మీటింగ్ హాల్‌లో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు డీఈఓ తెలిపారు.

More in Local