రైట్ వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు Radical Ajay పిలుపు

తెలుగులో ఉన్న రైట్ వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు, కంటెంట్ క్రియేటర్లకు అంబేడ్కరైట్, కంటెంట్ క్రియేటర్ ర్యాడికల్ అజయ్(Radical Ajay) పిలుపునిచ్చారు. వారితో పోడ్‌కాస్ట్ డిస్కషన్ చేసేందుకు తను సిద్ధమని, అందుకు తనే స్టూడియో ఏర్పాటు చేస్తానని అన్నారు. ఈ డిస్కషన్‌ను ఎటువంటి ఎడిటింగ్ లేకుండా అప్‌లోడ్ చేస్తానని, నిజాలు, ఆధారాలతో మాత్రమే ఈ డిస్కషన్ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం రూల్స్ కూడా పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు radicalajaykumar@gmail.comకి మెయిల్ చేయాలని చెప్పారు.




