← Back to news

కాలర్ పట్టుకుని సర్పంచ్‌పై మహిళ దాడి

By DK· 11 Jun 2026· Bigtvlive· సంగారెడ్డి జిల్లా
కాలర్ పట్టుకుని సర్పంచ్‌పై మహిళ దాడి

TG: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామ సర్పంచ్ ఒగ్గు సాయికిరణ్‌పై అదే గ్రామానికి చెందిన ఓ మహిళ కాలర్ పట్టుకొని దాడి చేసింది. జోగిపేట తహసీల్దార్ ఆఫీస్‌లో కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ అనంతరం సుశీల అనే మహిళకు చెందిన భూమిని సర్పంచ్ కుటుంబీకులు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని సర్పంచ్‌పై దాడి చేసింది. సర్పంచ్ అనుచరుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుండగా ఆ మహిళ అతని కాలర్ పట్టుకొని కొద్దిదూరం ఈడ్చుకొచ్చి దాడి చేసింది.

More in Local