రమానందనకు పోలీసులు 20 ప్రశ్నలు..!

యూట్యూబర్ రమానందన.. విజయవాడ.. ఇబ్రహీంపట్నం PSలో లాయర్లతో విచారణకు వచ్చారు. తనపై ఉన్న లుకౌట్ నోటీసును క్యాన్సిల్ చెయ్యాలని పోలీసులను కోరారు. పోలీసులు పరిశీలిస్తామన్నారు. విచారణకు తానూ, తన భర్త సహకరిస్తామని నందన తెలిపారు. ఆమెను పోలీసులు 20 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఆమె, ఆమె భర్త కలిసి.. డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా లండన్‌లో జాబ్ ఇప్పిస్తామని నమ్మించి తన దగ్గర 10లక్షల 50వేలు తీసుకున్నారని శ్రీనివాసరావు పెట్టిన కేసులో నందనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


