ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి: సీతక్క

TG: ములుగు జిల్లా గోవిందరావుపేట మండల MPDO కార్యాలయంలో మంత్రి సీతక్క సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆమె స్వయంగా వినతులను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించిన మంత్రి, వాటిని సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.





