ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. పేలిన 7 గ్యాస్ సిలిండర్లు
ముంబైలో ములుండ్ ఈస్ట్‌లోని BMC ప్రాజెక్ట్ అఫెక్టెడ్ పర్సన్స్(PAP) పునరావాస కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్మికుల నివాసాల్లోకి మంటలు వేగంగా వ్యాపించడంతో ఏడు గ్యాస్ సిలిండర్లు పేలినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని కార్మికులను సురక్షితంగా బయటకు తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.

