మందు తాగొద్దన్నందుకు..గ్యాంగ్ రేప్.. ఆపై హత్య

UP రాజధాని లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ ప్రాంతంలో ఘోరం జరిగింది. రాజేష్(గుడ్డు) అనే 30 ఏళ్ల వ్యక్తి, హరిరామ్ రావత్ అనే 34 ఏళ్ల వ్యక్తి మద్యం తాగుతున్నారు. 70 ఏళ్ల మహిళ అభ్యంతరం చెప్పింది. వాళ్లు ఆమెతో గొడవ పడ్డారు. ఆమెపై లైంగిక దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని ఇంటి వెనుక చీకటి ప్రాంతానికి తరలించి దాచాలని ప్రయత్నించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు.

