← Back to news

ఫ్యాక్టరీ వ్యర్థాలపై గ్రామస్తుల ఆందోళన

By SUDHAKAR· 1h ago· Thurpu Boyamadugula, Varikuntapadu, Sri Potti Sriramulu Nellore
ఫ్యాక్టరీ వ్యర్థాలపై గ్రామస్తుల ఆందోళన

నెల్లూరు జిల్లా గూడూరు మండలం వెడిచర్ల సమీపంలోని రఘురామ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న దుర్వాసనతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై 45 రోజుల క్రితమే RDOకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపించారు. ఫ్యాక్టరీ వ్యర్థాల విడుదలను నియంత్రించకపోతే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

More in Local