BSF అదుపులో 25 మంది బంగ్లాదేశ్ పౌరులు, ఒక దళారి

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లా కుష్‌మండి బ్లాక్ లోహగంజ్-పంచనగర్ ప్రాంతంలో Border Security Force(BSF) 25 మంది బంగ్లాదేశ్ పౌరులను, భారతీయ దళారిని అదుపులోకి తీసుకుంది. నిన్న తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. బంగ్లాదేశ్‌లోని ఠాకుర్‌గావ్ జిల్లాకు అక్రమంగా తిరిగి వెళ్లాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. గంగారాంపూర్‌కు చెందిన రాజు రాయ్ అనే దళారి ప్రతి వ్యక్తి నుంచి 12 వేలు తీసుకుని సరిహద్దు దాటించేందుకు సాయం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
