నాగర్‌కర్నూల్ జిల్లాలో బంగారు బతుకమ్మ
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని సావిత్రిబాయి పూలే ఒకేషనల్ జూనియర్ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ మహిళల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని నిర్వాహకులు తెలిపారు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు రాజేందర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



