← Back to news

2030కి క్విక్‌ కామర్స్‌ $70B మార్కెట్‌

By Nani Garikina· 21h ago· Financialexpress
2030కి క్విక్‌ కామర్స్‌ $70B మార్కెట్‌

“ఇది కావాలి” అనిపించిన వెంటనే షాప్‌కి వెళ్లకుండా.. ఫోన్‌లో ఆర్డర్‌ చేసి నిమిషాల్లో ఇంటికే తెప్పించుకోవడం ఇప్పుడు అలవాటవుతోంది. ఈ మార్పే క్విక్‌ కామర్స్‌ను పెంచుతోంది. Infisum అంచనా ప్రకారం భారత్‌లో ఈ మార్కెట్‌ 2030 నాటికి 65–70 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చు. డార్క్‌ స్టోర్లు కూడా 2025లో 2,525 నుంచి 2030 నాటికి 7,500కి పెరగొచ్చని అంచనా. కిరాణా సరుకులకే కాకుండా ఎలక్ట్రానిక్స్‌, బ్యూటీ వస్తువులకూ డెలివరీ పెరగొచ్చు. అంటే రేపటి షాపింగ్‌లో “ఎక్కడ దొరుకుతుంది?” కంటే.. “ఎంత త్వరగా వస్తుంది?” అన్నదే కీలకం.

More in National