ఢిల్లీ మిఠాయి వాలా పేరుతో నకిలీ వ్యాపారం
TG: హైదరాబాద్ అంబర్‌పేటలో నాసిరకం స్వీట్లు విక్రయిస్తున్న 'న్యూ ఢిల్లీ మిఠాయి వాలా' యజమాని ముఖేష్ బాటిని పోలీసులు అరెస్ట్ చేశారు. 1968 నుంచి రిజిస్టర్ అయిన 'ఢిల్లీ మిఠాయి వాలా' బ్రాండ్ పేరును అక్రమంగా వాడుతూ, బూజు పట్టిన స్వీట్లు అమ్ముతున్నారని అసలు యజమాని జితేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు నకిలీ ప్యాకింగ్ కవర్లు, బిల్లింగ్ మెషిన్లు, పాడైన మిఠాయిలను స్వాధీనం చేసుకున్నారు.



