← Back to news

ప్రజావాణిలో ప్రజా సమస్యలపై అర్జీలు

By Pinjari Shiva Kumar· 1h ago· Jagitial
ప్రజావాణిలో ప్రజా సమస్యలపై అర్జీలు

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 9 ఫిర్యాదులు అందినట్లు MPDO మహేందర్ రెడ్డి తెలిపారు. వివిధ శాఖలకు చెందిన 14 మంది అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖలకు రెండేసి, హౌసింగ్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖలకు ఒక్కో ఫిర్యాదు వచ్చాయి. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

More in Local