← Back to news

అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: గుడివాడ

By DK· 25 Jun 2026· విశాఖపట్నం జిల్లా
అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: గుడివాడ

AP: విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో CM చంద్రబాబు కుల రాజకీయాలకు తెరలేపుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటనపై కులాలను ప్రస్తావిస్తూ మాట్లాడిన సీఎం మరొకరు లేరని ఫైరయ్యారు. సాయికృష్ణ మరణాన్ని కేవలం ఒక CI చేసిన చర్యగా చూపించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. సాయికృష్ణ హత్య ప్రభుత్వ హత్య. ఇది ఒక CI చేసిన హత్య కాదు. DGP, DG, ACP అందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణ ద్వారా వాస్తవాలు బయటకు రావు, CBIతో విచారణ జరగాలన్నారు.

More in Politics