మాదాపూర్‌లో యాంటీ డ్రోన్ సెంటర్‌లో అగ్నిప్రమాదం.
TG: హైదరాబాద్ మాదాపూర్‌లో యాంటీ డ్రోన్ పరికరాలను టెస్ట్ చేసే సెంటర్‌లో ఫైర్ అయింది. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. సమాచారం అందడంతో ఫైర్ టీమ్ వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేసింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే అసలు ఫైర్ ఎలా అయింది? దీనికి కారణమేంటనే విషయం ఇంకా తెలియలేదు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు.


