← Back to news

పెద్దపల్లిలో రైతు సదస్సు.. 18న!

By Sagar· 40m ago· Ramagundam, Ramagundam, Peddapalli
పెద్దపల్లిలో రైతు సదస్సు.. 18న!

పెద్దపల్లి జిల్లాలో 18న రైతు సదస్సు జరగబోతోంది.. రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. గిట్టుబాటు ధరలు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, రుణమాఫీ, గిడ్డంగులు, కళ్లాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పార్టీలకతీతంగా రైతులు, కార్మికులు, యువకులు, మహిళలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

More in Local