← Back to news

DE గారూ.. కరెంటు కోతలాపండి

By సైదులు· 39m ago· Vidyanagar, Suryapet, Suryapet
DE గారూ.. కరెంటు కోతలాపండి

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలో కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు లేకపోవడంతో పాటు నాణ్యమైన విద్యుత్ లేక మోటార్లు కాలిపోతున్నాయి. గ్రామీణ పేదల సంఘం జిల్లా కన్వీనర్ కొనకంచి వీరభద్ర ఆధ్వర్యంలో రైతులు సూర్యాపేటలో DEకి వినతిపత్రం సమర్పించారు. తక్షణమే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల మల్లయ్య, కోడిబండయ్య, అనంతుల ఎల్లయ్య పాల్గొన్నారు. మీ ఊరిలో ఇలాంటి సమస్య ఉందా? మీ వార్త పంపండి!

More in Local