పులివెందులలో కాల్పుల కలకలం..!

వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో సోమవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. వినాయక విగ్రహం వద్ద పుష్పునాథ్ రెడ్డి, విజయకుమార్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. తనను సన్మానించలేదనే విషయంపై వాగ్వాదం జరిగి కాల్పులు జరిపినట్లు సమాచారం. బాషా గణేష్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. విజయ్ ఇంటి వద్ద మూడు వాహనాలను ధ్వంసం చేశారు. ఘటనపై ఉద్రిక్తత నెలకొంది.


