గణేష్ ఉత్సవాలపై డైరెక్షన్స్ ఇవే..

పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో ఆగస్టు నేర సమీక్షా సమావేశం జరిగింది. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. మహిళలు, బాలల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరగాలని సూచించారు. మండపాల వద్ద ప్రత్యేక నిఘా, అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని సీపీ కోరారు.




