ఫేక్ డాక్టర్లపై పోలీసుల ఫోకస్.. 12 మంది అరెస్ట్!
TG: ఫేక్ డాక్టర్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. అర్హతలు, బేసిక్ హెల్త్ నాలెడ్జ్ లేకుండానే అసలైన డాక్టర్లలా నటిస్తూ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, ఇంజెక్షన్లు, సెలైన్లు ఇస్తున్న <a href="https://x.com/SajjanarVC_IPS/status/2092891982670737561">12 మందిని</a> గుర్తించి యాక్షన్ తీసుకున్నామని తెలిపారు. ఇలాంటి ట్రీట్‌మెంట్ వల్ల ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముందన్నారు. ఫేక్ డాక్టర్ల గురించి తెలిస్తే వెంటనే 112కు లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సజ్జనార్ కోరారు.



