← Back to news

కొడుకులకు ఆస్తి.. తల్లిదండ్రులకు చావు

By Prashanth· 1 Oct 2026· Telangana

TG: సంగారెడ్డి జిల్లా.. నారాయణఖేడ్‌ మండలం.. చాప్తా.కె గ్రామంలో విషాదం జరిగింది. నర్సారెడ్డి, అంజమ్మ దంపతులు తమ 25 ఎకరాల భూమి, ఇంటిని ముగ్గురు కొడుకులకు పంచారని గ్రామస్తులు తెలిపారు. ఆ తర్వాత వారు పట్టించుకోకపోవడంతో దంపతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. బతకడానికి కొంత భూమి ఇవ్వాలని కొడుకులను కోరినా స్పందన లేకపోవడంతో బావిలో దూకి చనిపోయారని తెలిపారు. మనవడి కంప్లైంట్‌తో పోలీసులు కేసు రాసి, దర్యాప్తు చేస్తున్నారు.

More in Crime