టీచర్స్ డే.. సెప్టెంబర్ 5నే ఎందుకు?

టీచర్స్ డే అంటే టీచర్లకు గ్రీటింగ్స్, గిఫ్ట్స్.. కానీ సెప్టెంబర్ 5నే ఎందుకు జరుపుకుంటామో తెలుసా? ఈ రోజే భారత రెండో రాష్ట్రపతి, తత్వవేత్త, విద్యావేత్త Dr సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు. 1962లో ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, విద్యార్థులు ఆయన పుట్టినరోజును సెలబ్రేట్ చేయాలనుకున్నారు. అయితే తన బర్త్‌డే కంటే టీచర్లను గౌరవించే రోజుగా జరుపుకుంటేనే సంతోషమని చెప్పారు. అప్పటి నుంచి సెప్టెంబర్ 5 టీచర్స్ డేగా మారింది. ఇది కేవలం సెలబ్రేషన్ కాదు.. మనల్ని తీర్చిదిద్దిన టీచర్‌కు థ్యాంక్స్ చెప్పే రోజు!



