బాలికపై 9 మంది అత్యాచారం

TG: హైదరాబాద్.. అల్వాల్‌లో ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలికపై 9 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 3 రోజులపాటూ.. వేర్వేరు ప్రాంతాల్లో ఈ దారుణం జరిగినట్లు తెలిసింది. బాలిక ఇంటికి చేరి కుటుంబ సభ్యులకు వివరించడంతో అల్వాల్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, చంచల్‌గూడ జైలుకి తరలించారు. మిగతా నలుగురి కోసం గాలిస్తున్నారు. నిందితులు బాలికకు గంజాయి ఇచ్చినట్లు తెలిసింది. దర్యాప్తు కొనసాగుతోంది.
