← Back to news

3 గంటల్లో భారీ వర్షాలు

By BK· 1h ago· AP
3 గంటల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారనుంది. రాబోయే మూడు గంటల్లో అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తీవ్రమైన ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఈ జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేశారు. వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

More in AP