జనరేటర్ పేలి బ్యాంక్‌లో మంటలు

TG: ఖమ్మం జిల్లా ఏన్కూరు SBI బ్యాంక్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మంగళవారం సాయంత్రం SBI బ్యాంక్‌లో కరెంట్ సప్లై కాకపోవడంతో సిబ్బంది జనరేటర్‌ను ఆన్ చేశారు. ఒక్కసారిగా పేలుడు సంభవించి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. బ్యాంక్ అధికారులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఎండ తీవ్రత కారణంగా జనరేటర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు బ్యాంక్ సిబ్బంది తెలిపారు. ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంలో ఊపిరి పీల్చుకున్నారు.



