పిల్లల చదువుపై AI ఎఫెక్ట్

టెక్నాలజీ వేగంగా దూసుకెళ్తున్నా.. పిల్లల చదువు మాత్రం వెనకబడుతోందని PISA తాజా రిపోర్ట్ తెలిపింది. 91 దేశాల్లోని 7 లక్షల 60వేల మంది.. 15 ఏళ్ల విద్యార్థులపై చేసిన స్టడీలో.. ప్రతి ఐదుగురిలో ఒకరు సరిగా చదవలేకపోతున్నారని తెలిసింది. సైన్స్, మ్యాథ్స్‌లో మినిమం లెవెల్‌ని కూడా అందుకోలేకపోతున్నట్లు తేలింది. AI, డిజిటల్ టూల్స్‌ను ఎక్కువగా వాడితే నేర్చుకునే స్కిల్ తగ్గుతోందని రిపోర్ట్ హెచ్చరించింది. నిదానంగా, ఎక్కువగా చదివే అలవాటు పిల్లలకు అవసరమని సూచించింది.

