← Back to news

ఇంద్రుడిపై కంప్లైంట్.. కారణం?

By Mahesh Kuruva· 1d ago· Theprint· Uttar Pradesh
ఇంద్రుడిపై కంప్లైంట్.. కారణం?

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హర్దోయ్ జిల్లాకు చెందిన సూరజ్ తివారీ.. భారీ వర్షాలకు ఇంద్రుడే కారణమంటూ రాష్ట్ర ప్రజా ఫిర్యాదుల పోర్టల్‌లో కంప్లైంట్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా ఇంద్రుడు వర్షాలు కురిపిస్తున్నాడని, రోడ్లు, ఫ్లడ్-ప్రోన్ ఏరియాలు నీట మునిగాయని కంప్లైంట్‌లో రాశారు. ఇంద్రుడి ఫోన్ నంబర్ తనకు తెలియదని, అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఇంద్రుడికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కంప్లైంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వర్షాల కారణంగా UPలో 56 మంది, హర్దోయ్‌లో ఏడుగురు మృతి చెందారు.

More in Viral