వాగుపై రాతి వంతెన నిర్మించుకున్న గిరిజనులు
AP: ప్రభుత్వ హామీలు నెరవేరకపోవడంతో గిరిజన గ్రామస్తులే వాగుపై వారధి నిర్మించుకున్నారు. అల్లూరి జిల్లా గొల్లపల్లి, పెబ్బంపల్లి, తడకపల్లి గ్రామాల ప్రజలు ఇంటికి రూ.200 చొప్పున విరాళాలు సేకరించి,రాళ్లు మోసుకుంటూ గొల్లపల్లి –నడింవీధి వాగుపై రాతి వారధిని నిర్మించారు. గతంలో గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారిని డోలీలపై మోసుకెళ్లాల్సి వస్తుంది, ఈ వారధితో ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి అని చెప్పారు. ప్రభుత్వానికీ ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని తెలిపారు


