← Back to news

‘మిష్మీ కొండలు’ - అనువాద నవల

By Vishi· 4d ago
‘మిష్మీ కొండలు’ - అనువాద నవల

మన దేశంలో సూర్యుడు మొదట ఉదయించే అరుణాచల్ ప్రదేశ్‌లో మిష్మీ కొండలున్నాయి. ఆ ప్రాంతానికి చెందిన రచయిత్రి మమాంగ్ డాయ్ ‘The Black Hill’ అనే పేరుతో ఇంగ్లీష్‌లో నవల రాశారు. దాన్ని మూర్తి కె.వి.వి.ఎస్ ‘మిష్మీ కొండలు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ నవల చదువుతుంటే టిబెట్‌కు, హిమాలయాలకు దగ్గరగా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మిష్మీ కొండల సౌందర్యం కళ్ల ముందు కదులుతుంది. 1826లో తెగల మధ్య పోరాటాలు, బ్రిటిష్ వారి రాక, వారితో జరుగుతున్న సంఘర్షణల నేపథ్యంలో ఈ నవల ఉంటుంది. నవల ధర రూ.230. కొనే <a href="https://www.telugubooks.in/products/mishmi-kondalu?srsltid=AfmBOoqwChgwaLg0aTqLUPVuUd4RCjYactzre0WHLuk9U6D1c7j8AOAJ">లింక్</a> ఇది.

More in Arts/Literature

స్త్రీల గర్భం, స్వేచ్ఛపై సామాజిక వ్యాఖ్యానం
Arts/Literature· 1d ago

స్త్రీల గర్భం, స్వేచ్ఛపై సామాజిక వ్యాఖ్యానం

ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ ప్రపంచ స్త్రీవాద సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించింది. ఇటాలియన్ రచయిత్రి ఒరియనా ఫాలసి రాసిన ‘Letter to a Child Never Born’ పుస్తకాన్ని ఓల్గా తెలుగులో అనువాదం చేశారు. తల్లి తన కడుపులో బిడ్డ ఉన్నట్టు గుర్తించినప్పటి నుంచి, అండం గర్భంలో పెరిగి రూపం మారే ప్రక్రియను ఇందులో వివరంగా చెప్పారు. ఇది కేవలం శరీరం గురించి రాసిన రచనే కాదు, సామాజిక వ్యాఖ్యానం కూడా. పితృస్వామ్యం మన ఆచారాలు, భాష, సంస్కృతులను ఎలా తయారు చేసిందో ఈ పుస్తకం చెబుతుంది. పుస్తకం ధర రూ.100. కొనే <a href="https://www.telugubooks.in/products/puttani-biddaku-thalli-uttharam?srsltid=AfmBOorDrAEUy8FkbTr9Tubb4BId_N3ZPRpD-RxM8kBlKq7YQfh7Ni_b">లింక్</a>.