← Back to news

అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన

By పి. జె. మార్క్· 2h ago· Penuganchiprolu, Penuganchiprolu, Ntr
అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన

AP: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత ఆలయ గోశాలలో గోవులకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిత్యకళ్యాణ మండపంలో సుమారు 1,500 మంది ముత్తైదువులు సామూహిక కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారిని పూజించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ చుంచు రమేష్‌బాబు, సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

More in Local