ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
TG: సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. మనూరు గ్రామ శివారులో బట్టలు ఉతకడానికి వెళ్లి నీటిలోకి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులు నరసింహారెడ్డి (45), సంగమేశ్వర్ రెడ్డి (42), కృష్ణవేణి (38)గా గుర్తించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల కన్నీరుమున్నీరవుతున్నారు.



