గుడిలో దొంగతనం

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి అయ్యప్ప గుడిలో నిన్న రాత్రి దొంగలు పడ్డారు. సీసీ కెమెరాలు, హుండీ పగులగొట్టి డబ్బులు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ గుడిలో దొంగతనం జరగడం ఇది నాలుగోసారి. అయ్యప్ప కిరీటంతో పాటు బంగారం, వెండి, క్యాష్ పోయాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో వచ్చి విచారణ చేస్తున్నారు.


